ప్రతి ఒక్కరు తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి..

257
pocharam
- Advertisement -

సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ చేపట్టిన “ప్రతి ఆదివారం- పది గంటలకు- పదినిమిషాలు”లో భాగంగా బాన్సువాడ పట్టణంలో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి. పట్టణ ప్రధాన రహదారి వెంట ఉన్న డ్రైనేజీలోని చెత్త, వ్యర్ధాలను తొలగించే పనులను చేయించారు స్పీకర్ పోచారం.

ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. పురపాలక శాఖ మంత్రి కేటి రామారావు ఇచ్చిన పిలుపు మేరకు నాలుగవ ఆదివారం ఈ కార్యక్రమం కొనసాగుతుంది.దీన్నొక సామాజిక కార్యక్రమంగా భావించి రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ప్రతి ఆదివారం ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటి లొపలితో పాటుగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు.

పరిశుభ్రత తోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.పరిశుభ్రంగా ఉంటే సీజన్‌లలో వచ్చే అంటువ్యాధుల నుండి కాపాడుకోవచ్చు.ఇదొక మంచి అవకాశం, పట్టణాలు, నగరాలలో ఉన్న ప్రతి ఒక్కరు తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. తమ ఆరోగ్యం కోసం వారంలో పది నిమిషాలు కేటాయించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని పోచారం అన్నారు.

- Advertisement -