తెలంగాణ శాసనసభ రెండో స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అన్నిపార్టీల మద్దతుతో స్పీకర్‌గా ఆరు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు పోచారం. పోచారం ఒక్కడే నామినేషన్ దాఖలు చేయడంతో అసెంబ్లీ స్పీకర్‌గా ఆయన ఎన్నికైనట్లు సభలో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ లాంఛనంగా ప్రకటించారు.
స్పీకర్ స్థానంలో పోచారంని తీసుకురావాల్సిందిగా సభా నాయకుడు, విపక్ష నేతలను కోరిన పిదప.. ప్రొటెం స్పీకర్ అధ్యక్ష స్థానాన్ని వీడారు. అనంతరం సీఎం కేసీఆర్ కొత్త స్పీకర్ ని సభాపతి స్థానంలో కూర్చొబెట్టారు.
శనివారం ఉదయం 11.30 గంటలకు శాసనసభ, మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం బీఏసీ సమావేశాలు జరగనున్నాయి. స్పీకర్‌గా ఎన్నికైన పోచారంకు ఎంపీలు,ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. స్పీకర్‌గా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.