రైతుబంధు నిధులు విడుదల..పోచారం హర్షం

424
pocharam srinivasreddy
- Advertisement -

కరోనా కష్టకాలంలో రైతు బంధు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు నిజామాబాద్ డీసీసీడీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. కామారెడ్డిలో మాట్లాడిన ఆయన రైతుబంధు నిధులను ప్రభుత్వం ఒకేరోజు 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 5,294.53 కోట్లు జమ చేసిందని చెప్పారు.

జూన్16 వరకు పాస్ బుక్ వచ్చిన ప్రతీ ఒక్కరికి రైతు బంధు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డు సమయంలో రైతు బంధు నిధులు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్,మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి రైతుల పక్షాన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -