శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ సవాల్‌ను స్వీకరించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా మొక్కలు నాటిన పోచారం ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరారు. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్ శర్మ,ఎంపీ కేశవరావు,ఇన్ఫోటెక్ ఛైర్మన్ మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. గ్రీన్ ఛాలెంజ్‌ను ఉద్యమంగా మార్చిన ఎంపీ సంతోష్‌ని అభినందించారు పోచారం.
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు అనుహ్యమైన స్పందన వస్తోంది. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ఈ గ్రీన్ ఛాలెంజ్ మూడు కోట్ల మైలు రాయిని దాటింది. సినీ , రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తు మరో ముగ్గురికి సవాల్ విసురుతున్నారు.
నల్గొండ జిల్లా చిట్యాలలోని తన వ్యవసాయ క్షేత్రం లో మూడు మొక్కలు నాటారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, సాగర్ సిమెంట్ అధినేత ఆనంద్ రెడ్డి,ఎన్టీవీ ఛైర్మెన్ నరేంద్ర చౌదరికి సవాల్ విసిరారు. గుత్తా సవాల్‌ని స్వీకరించిన పోచారం ఇవాళ మొక్కలు నాటారు.
I have accepted #GreenIndiaChallenge from @GuthaSukender garu planted 3 saplings 🌱and now i invite #RajeevSharma Spl Govt advisor #Keshavarao Mp Rajya Sabha and #MohanReddy #Infotech chairman to continue.. and congratulations to @MPsantoshtrs for good initiate for climate change pic.twitter.com/ocNxtJrakr
— Pocharam Srinivas Reddy (@PSRTRS) October 26, 2019