నామినేషన్ వేసిన పోచంపల్లి..

150
srinivas mlc
- Advertisement -

ఉమ్మడి వరంగల్ జిల్లా స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌తో కలిసి తన నామినేషన్ పత్రాలను వరంగల్ జిల్లా కలెక్టర్‌ గోపికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కా ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండ ప్రకాష్, నర్సంపేట, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి నన్నపునేని నరేందర్, ములుగు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ జగదీశ్వర్, వరంగల్ నగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జడ్పీ వైస్ చైర్మన్ ఏ శ్రీనివాస్, జడ్పీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న తదితరులు పాల్గొన్నారు.

కాగా, ఇవాళ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రకటన వెలువడనుంది. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగుస్తున్నది. ఆరు స్థానాలకు బరిలో ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు. దీంతో ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు.

- Advertisement -