రఫేల్‌పై మోడీ వాదన ఫెయిల్‌:రాహుల్

226
rahul gandhi
- Advertisement -

రాఫేల్ ఒప్పందంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ వాదన ఫెయిలయిందని తెలిపారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ద హిందూ పత్రిక ప్రచురించిన కథనాన్ని ప్రస్తావిస్తూ వేగవంతమైన డెలివరీ,రేటు విషయంలో యూపీఏ ప్రభుత్వంలో జరిగిన ఒప్పందం కంటే కొత్త ఒప్పందమే అనేక రేట్లు మేలని వాదించిన మోడీ బండారం బట్టబయలైందన్నారు.

రెండు అంశాల్లో మొదటిది ఉత్తమ ధర, రెండోది వేగవంతమైన డెలివరీ. కానీ తాజా ‘ద హిందూ’ నివేదికతో ఈ రెండు విషయాల్లో ఆయన వాదనలు తప్పని తేలిపోయిందని రాహుల్‌ ట్విట్టర్‌లో విమర్శించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల్ని ప్రధాని ఖండిస్తూ వచ్చారన్నారు. నిబంధనల విషయంలో తాజా ఒప్పందం కంటే యూపీఏ హయాంలో జరిగిన ఒప్పందమే ఉత్తమమైనదని ‘ద హిందూ’ పేర్కొందని రాహుల్ గుర్తుచేశారు.

యూపీఏ హయాంలో జరిగిన ఒప్పందం కంటే తాజా ఒప్పందంలో 36 యుద్ధ విమానాల ధర 55శాతం ఎక్కువగా ఉందని ఆరోపించారు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా. అంతకు ముందు ‘యూరోఫైటర్‌’ ప్రతిపాదించిన 25శాతం రాయితీని సైతం కోల్పోయామని..దీంతో నష్టం వాటిల్లిందన్నారు. జమానతుల విషయంలోనూ కేంద్ర కావాలనే రాజీపడిందన్నారు.

- Advertisement -