ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాని

25
- Advertisement -

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మహారాష్ట్ర పర్యటన ముగించుకొని రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాన మంత్రి మోడీ.. ఇవాళ ఉదయం పది గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

మోడీ ప్రత్యేకంగా పూజలు చేయడానికి రావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ నుండి ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లే మార్గంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత ప్రధాన మంత్రి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుండి సంగారెడ్డికి బయలుదేరారు.

Also Read:బోల్డ్ వైపు టాలెంటెడ్ నటి

- Advertisement -