నేడు సౌదీ పర్యటనకు ప్రధాని మోదీ

362
pm modi
- Advertisement -

ప్రధాని మోదీ నేడు సౌదీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటించనున్నారు. సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఆహ్వానం మేరకు మోదీ సౌదీ పయనమయ్యారు. ఈ పర్యటనలో మోదీ సౌదీ రాజుతో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.

ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య ఆర్థికపరమైన అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశముంది. పర్యటనలో భాగంగా సౌదీ రాజుతో కలిసి మోదీ రూపే కార్డును లాంచ్ చేయనున్నారు. సోమవారం సాయంత్రం భారత ప్రధాని సౌదీ మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మోదీ ప్రవాస భారతీయులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తారు.

- Advertisement -