- Advertisement -
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 112 అడుగుల యోగాకు మూలమైన ఆది యోగి శివుని విగ్రహాన్ని ఈరోజు ఈశా యోగా కేంద్రం, కోయంబత్తూర్, తమిళనాడు వద్ద ఆవిష్కరించారు. ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు, సద్గురు దీనిని రూపకల్పన చేసారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ముఖం, ఆదియోగి మానవాళికి అందించిన ఎనలేని కానుకకు గుర్తింపు. మనిషి యోగ శాస్తం ద్వారా తమ పరమోన్నత స్థితికి చేరుకొనేందుకు ఉన్న 112 మార్గాలకు ప్రతీకగా, ముక్తికి చిహ్నంగా ఈ కీర్తివంతమైన దీని ముఖం నిలుస్తుంది.
ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్ సీహెచ్. విద్యాసాగరరావు, పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -