ఇవాంకకు మోదీ కానుక..

210
- Advertisement -

విశిష్ట అతిథికి విశిష్ట కానుకే అందింది! ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎ్‌స)లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు ఇవాంకాకు ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతిని అందజేశారు. గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సాదేలీ రకానికి చెందిన రేఖాగణిత పునరావృత నమూనాలతో కూడిన మైక్రో మోజాయక్‌ బాక్స్‌ను ఆమెకు ఇచ్చారు. విశేష నైపుణ్యంతో తయారు చేసిన ఈ బాక్స్‌ను ప్రధాని ప్రత్యేకంగా సూరత్‌ నుంచి తెప్పించినట్టు సమాచారం.

PM Modi's gift to Ivanka Trump

అయితే హైదరాబాద్‌లో ప్రారంభమైన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సదస్సు మొదటి రోజు ముగిసిన వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించారు ఇవాంక ట్రంప్‌. ‘‘ భారత ప్రధాని మోదీతో సమావేశమవ్వడం సంతోషంగా ఉంది. 8వ గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సదస్సుకు సహ అతిథ్యం అందిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు.

- Advertisement -