ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపావళి వేడుకలను ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌లో జరుపుకోనున్నారు. ఈనెల 7వ తేదీన మోదీ దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉదయం 9.15 నిమిషాల నుంచి 11.15 నిమిషాల వరకు ఉండనున్నారు.
2013లో వచ్చిన వరదల తర్వాత కేదార్‌నాథ్ పూర్తిగా దెబ్బతిన్నది. తన పర్యటనలో భాగంగా పునర్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. మందాకినీ, సరస్వతి నదులపై నిర్మించిన బ్రిడ్జ్‌లను పనుల పురోగతిని అడిగితెలుసుకోనున్నారు. ప్రధాని రాక సందర్భంగా ఇప్పటికే కేదార్‌నాథ్‌కు చేరుకున్న ఎస్‌పీజీ టీమ్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. గత ఏడాదిన్నర
కాలంలో మోదీ కేదార్‌నాథ్‌కు మూడుసార్లు వెళ్లారు.
ప్రధానిగా తొలి దీపావళిని 2014వ సంవత్సరంలో సియాచిన్లో జరుపుకున్నారు. తర్వాత ఏడాది దీపావళి పంజాబులోని పాకిస్థానీ సరిహద్దుల వద్ద జవాన్ల మధ్య గడిపారు. గత ఏడాది ఉత్తరాఖండ్‌లోని చమోలీలో ఇండో టిబెటన్ సరిహద్దులో దివాళీని సెలబ్రేట్ చేసుకున్నారు మోడీ.