సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం..

160
PM Modi's 5th virtual meeting with CMs
- Advertisement -

ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ అమలుపై చర్చించనున్నారు ప్రధాని. మే 17 లాక్‌డౌన్-3 ముగుస్తున్న నేపథ్యంలో మరిన్ని సడలింపులు ఇవ్వాలా? లేదంటే లాక్‌డౌన్‌ను కొనసాగించాలా? అనే దానిపై సీఎంల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.

దేశంలోకి కరోనా అడుగుపెట్టాక సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది ఐడోసారి. నేటి సమావేశం రెండు దఫాలుగా జరగనుంది. మధ్యాహ్నం 3 నుంచి 05.30 వరకు తొలి సెషన్, సాయంత్రం 6 నుంచి రెండో సెషన్ ప్రారంభం కానుంది. ఈ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ మాట్లాడతారు.

- Advertisement -