- Advertisement -
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లడఖ్‌లో ఆకస్మిక పర్యటన చేశారు. చైనాతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో అకస్మాత్తుగా లేహ్ వెళ్లారు. అక్కడ సైనికులతో మాట్లాడారు. ప్రస్తుతం లడఖ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడి పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి ఇవాళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేహ్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ ఆయన షెడ్యూల్‌ను మార్చేసి ప్రధాని స్వయంగా లడఖ్‌కు చేరుకున్నారు. ప్రధాని వెంట త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్‌తో పాటు ఆర్మీ చీఫ్ నరవాణే ఉన్నారు.
- Advertisement -