ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 23 నుంచి 26 వరకు విదేశీ పర్యటన చేపట్టనున్నారు. యూకే, మాల్దీవుల్లో పర్యటించనున్న మోడీ.. రెండు దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. జూలై 23 నుండి 24 వరకు యుకెకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా, భారతదేశం-యుకె మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం (India-UK FTA) పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ ఒప్పందం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $120 బిలియన్లకు పెంచే లక్ష్యం ఉంది. ఒప్పందం కుదిరిన తర్వాత, అది బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదం మరియు భారత కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది.
Also Read:కాంగ్రెస్ ఎమ్మెల్యేపై తిరగబడ్డ రైతులు
జూలై 25–26 తేదీల్లో ప్రధానమంత్రి మోదీ మాల్దీవులకు పర్యటనకు వెళ్లనున్నారు.ఆ దేశంలో జరగనున్న 60వ జాతీయ దినోత్సవ వేడుకలకు అతిథిగా హాజరుకానున్నారు.మాల్దీవుల ప్రెసిడెంట్ మహ్మద్ ముఇజ్జు పదవీ కాలంలో మోదీ చేస్తున్న మొదటి పర్యటన ఇది.

