ఈనెల 26న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు విచ్చేయనున్నారు. గచ్చిబౌలిలో జరిగే ఐఎస్‌బీ గ్రాడ్యుయేషన్ సెరిమనీలో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు గురువారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసు అధికారులు వెల్లడించారు. మోదీ పర్యటన సంధర్భంగా సైబరాబాద్ పరిధిలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. 26న మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.
– గచ్చిబౌలి స్టేడియం, త్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి మధ్యలో ఉన్న ఆఫీసుల్లో పనిచేసే వారు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా.. టైమింగ్స్ మార్చుకోవాలని పోలీసుల సూచించారు.
– గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లేవారు.. గచ్చిబౌలి జంక్షన్ దగ్గర రైట్ టర్న్ తీసుకుని బొటానికల్ గార్డెన్, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, మజీద్ బండ, హెచ్ సీయూ డిపో ద్వారా లింగంపల్లికి వెళ్లాలని సూచించారు.
– లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వచ్చేవారు హెచ్ సీయూ డిపో దగ్గర లెఫ్ట్ తీసుకుని మజీద్ బండ, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, బొటానికల్ గార్డెన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ కి చేరుకోవాలి.
– విప్రో నుంచి లింగంపల్లికి వెళ్లేవారు విప్రో జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకుని క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపనపల్లి ఎక్స్ రోడ్, హెచ్ సీయూ బ్యాక్ గేట్, నల్లగండ్ల నుంచి లింగంపల్లి కి వెళ్లాలి.
– విప్రో నుంచి గచ్చిబౌలికి వెళ్లేవారు విప్రో జంక్షన్ దగ్గర రైట్ తీసుకుని ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్ రామ్ గూడ రోటరీ, ఓఆర్ఆర్, ఎల్ఆండ్ టీ టవర్స్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్ కి చేరుకోవాలి.
– కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్ కి వెళ్లేవారు కేబుల్ బ్రిడ్జ్ పైకి ఎక్కే ర్యాంప్ దగ్గర రైట్ తీసుకుని రత్నదీప్, మాదాపూర్ పీఎస్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్ కి వెళ్లాలి అని ట్రాఫిక్ అధికారులు సూచించారు.