Modi:5 దేశాల పర్యటనకు మోదీ

6
- Advertisement -

జులై 2 నుంచి ప్రధాని మోదీ 5 దేశాల్లో పర్యటించనున్నారు. 8 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ. బ్రెజిల్, ఘనా, ట్రినిడాడ్, అర్జెంటీనాలో పర్యటించనున్నారు ప్రధాని. అలాగే బ్రెజిల్‍లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు ప్రధాని.

జూలై 2–3 తేదీల్లో గానాకు వెళ్లనున్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత్‌ నుంచి గానాకు ప్రధానమంత్రి పర్యటన జరుగుతోంది. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని గానా అధ్యక్షుడితో చర్చలు జరిపి, ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మార్గాలు చర్చించనున్నారు.

జూలై 3–4 తేదీల్లో ప్రధాని…. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు వెళ్లి ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగలో, ప్రధాని కమ్లా పర్సాద్-బిసెస్సర్‌లతో సమావేశమవుతారు. ఇది 1999 తర్వాత భారత ప్రధాని ట్రినిడాడ్‌కు వెళ్లే తొలి పర్యటన. అక్కడి పార్లమెంటు ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది.

జూలై 4–5 తేదీల్లో అర్జెంటీనాలో ప్రధాని మోదీ అధ్యక్షుడు జావియర్ మిల్లెయితో వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, మైనింగ్, నౌకాయానం, పునరుత్పత్తి శక్తి, పెట్టుబడులు వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేలా చర్చలు జరపనున్నారు.

జూలై 5–8 తేదీల్లో ఆపై బ్రెజిల్‌కు వెళ్లి, 17వ BRICS శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. రియో డి జెనీరోలో జరిగే ఈ సమావేశంలో, ప్రపంచ పాలనలో సంస్కరణలు, శాంతి, బహుళపక్ష వ్యవస్థ బలపర్చడం, కృత్రిమ మేధస్సు వినియోగం, వాతావరణ చర్యలు, ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రధాని మోదీ ఇతర దేశాధినేతలతో చర్చిస్తారు. తర్వాత బ్రెజిలియాకు వెళ్లి, అధ్యక్షుడు లులా ద సిల్వాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, రక్షణ, శక్తి, వ్యవసాయం, ఆరోగ్యం, అంతరిక్ష రంగాల్లో సహకారంపై చర్చలు జరుగుతాయి.

Also Read:సాగునీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకం:హరీష్

జూలై 8–9 తేదీల్లో చివరిదశలో నామిబియాకు వెళ్లి అధ్యక్షురాలు నెతుంబో నాండి-న్దైత్వాతో సమావేశమవుతారు. ప్రధాని నామిబియా పార్లమెంటులో ప్రసంగించనున్న అవకాశం ఉంది.

- Advertisement -