- Advertisement -
అన్నిరాష్ట్రాల సీఎంలతో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా తీవ్రత, ప్రస్తుత పరిస్థితిపై ఈ సమావేశంలో సమీక్ష చేయనున్నారు ప్రధాని. కరోనా సెకండ్ వేవ్, కేసులు పెరుగుతుండడంతో తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరగనుంది.
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విధానం, వ్యూహంపై ముఖ్యమంత్రులతో చర్చించబోతున్నారు. ముఖ్యమంత్రులతో రెండు విడతలుగా సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. తొలుత అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పరిస్థితిని సమీక్షించనున్నారు… ప్రధాని. ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సిన్ పంపిణీ ఎలా చేయాలన్న దానిపై సమీక్ష జరపనున్నారు.
- Advertisement -