సార్వత్రిక ఎన్నికలకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలిఉన్న తరుణంలో కాంగ్రెస్,బీజేపీ దూకుడు పెంచాయి. ఇక ఇప్పటికే కాంగ్రెస్ 15 మందితో తొలిజాబితాను విడుదల చేయగా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ యూపీలోని అమేథి నుండి, రాయ్‌బరేలి నుండి సోనియా బరిలో దిగననున్నారు.ఇక ప్రధానమంత్రి నరేంద్రమోడీ సైతం యూపీ నుండి పోటీకి సై అన్నారు.
2014 ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించిన వారణాసి నుండి తిరిగిపోటీచేయనున్నారు మోడీ. ఈ మేరకు బీజేపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో పాటు మరోస్ధానం నుండి మోడీ పోటీచేస్తారని చెప్పిన బీజేపీ నేతలు త్వరలోనే ఆ స్ధానాన్ని ప్రకటిస్తామన్నారు.
2014 ఎన్నికల్లో యూపీలోని వారణాసి,గుజరాత్‌లోని వడోదర నుండి బరిలో నిలిచారు మోడీ. వారణాసిలో ఆమ్ ఆద్మీ నేత కేజ్రీవాల్‌పై 3 లక్షల ఓట్లతో గెలుపొందగా కాంగ్రెస్ అభ్యర్ధికి కేవలం 75 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇక గుజరాత్‌లోని వడోధర నుండి దాదాపుగా 5 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈ సారి వారణాసి నుండి తిరిగి పోటీచేయనున్న మోడీ..రెండోస్ధానం సొంత రాష్ట్రం గుజరాత్ లేదా మరెక్కడి నుండా అన్నది సస్పెన్స్‌గా మారింది.