సుందర్ పిచాయ్‌ పై ప్రధాని ప్రశంసలు

29
- Advertisement -

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై ప్రశంసలు గుప్పించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. వర్చువల్‌గా జరిగిన సమావేశంలో భారతదేశంలో క్రోమ్‌బుక్‌లను తయారు చేయడంలో హ్యూలెట్ ప్యాకర్డ్ తో గూగుల్ భాగస్వామ్యాన్ని ప్రధాని కొనియాడారు. గాంధీనగర్‌లోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్)లో తన గ్లోబల్ ఫిన్‌టెక్ కార్యకలాపాల కేంద్రాన్ని ప్రారంభించాలనే గూగుల్ ప్రణాళికను స్వాగతించారు.

భారతీయ భాషలలో AI సాధనాలను అందుబాటులో ఉంచే ప్రయత్నాలలో భాగంగా గూగుల్ 100 భాషలలో తీసుకుంటున్న చొరవ బాగుందని సుందర్‌కు కితాబిచ్చారు. AI సమ్మిట్‌లో రాబోయే ప్రపంచ భాగస్వామ్యానికి సహకరించడానికి సుందర్ పిచాయ్‌ని కూడా ఆహ్వానించారు. డిసెంబర్ 2023లో భారతదేశం దీనికి న్యూఢిల్లీలో ఆతిథ్యం ఇవ్వనుంది.

సుందర్ పిచాయ్, మిమ్మల్ని కలవడం, ఆవిష్కరణలు, సాంకేతికత మొదలైన వాటి గురించి చర్చించడం ఆనందంగా ఉందని చెప్పారు ప్రధాని మోడీ. మానవ శ్రేయస్సు , స్థిరమైన అభివృద్ధి కోసం సాంకేతికతను ప్రభావితం చేయడానికి ప్రపంచం కలిసి పనిచేయడం చాలా ముఖ్యం అన్నారు.

Also Read:నవాబ్…ఫస్ట్ లుక్

- Advertisement -