- Advertisement -
ఆదివారం ఉత్తర్ ప్రదేశ్ అవతరణ దినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో యూపీ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాన అన్నారు. త్యాగానికి, సమున్నత సంస్కృతి, సంప్రదాయాలకు ఉత్తర్‌ప్రదేశ్ పెట్టిందిపేరని ఆయన కొనియాడారు.
యూపీ అన్ని రంగాల్లో మున్ముందుకు దూసుకుపోవాలని మోదీ ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ విశేషంగా కృషిచేస్తున్నారని ప్రశంసించారు. అలాగే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. యూపీ అభివృద్ధికి ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యానాథ్‌లు శ్రమిస్తున్నారని అమిత్ షా ట్వీట్ చేశారు.
- Advertisement -