గుజరాత్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భాంతి..

125
pm modi
- Advertisement -

గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో జరిగిన ఘటనలో 15 మంది వసల కూలీలు మృతి.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆక్షాంచారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియో ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు.

అలాగే గుజరాత్‌ ప్రభుత్వం సైతం బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షలు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రుపాని ప్రకటించారు. ఘటన చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈ ఘటనపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -