హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోదీ..

72
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మోదీకి గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చీఫ్ సెక్రటరీ, డీజీపీలు స్వాగతం పలకనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పర్యటనలో ఆయన రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ముందుగా ప్రధాని ఇక్రిశాట్ 50 ఏళ్ల ఉత్సవాలకు హాజరుకానున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కాగా, స్వల్ప జ్వర లక్షణాలతో సీఎం కేసీఆర్‌ ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నారు.

- Advertisement -