ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జి7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు కెనడాకు చేరుకున్నారు. కెనడాలోని ఆల్బర్టా రాష్ట్రం కాననాస్కిస్‌లో జీ7 సమ్మిట్ జరగనుండగా ఇజ్రాయెల్-ఇరాన్, రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈసారి సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో, ప్రధాని మోదీ జీ7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు కెనడా కల్గరీ నగరానికి చేరుకున్నారు. దీని ముందు వారు సైప్రస్ దేశాన్ని సందర్శించి అక్కడి అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్‌తో విశ్లేషణాత్మక చర్చలు నిర్వహించారు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం మోదీ పాల్గొంటున్న తొలి బహుపాక్షిక సదస్సు. ఈ పర్యటనలో మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీతో పాటు జీ7 సభ్య దేశాల ఇతర నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.
మోదీ, జెలెన్‌స్కీతో పాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా దేశాల నాయకులు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ సమావేశానికి హాజరవుతున్నారు.ఈ సమ్మిట్ అనంతరం మోదీ మంగళవారం సాయంత్రం క్రొయేషియాలోని జాగ్రెబ్ నగరానికి బయలుదేరి తన అంతర్జాతీయ పర్యటనను ముగించనున్నారు.
Also Read:సంక్రాంతికి #RT76

