సీఎం రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి ఫోన్

7
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టాన్ని ప్రధాని దృష్టి కి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి.

ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలను.. తీసుకున్న జాగ్రత్తలను వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానికి వివరించారు సీఎం.

ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందించారు ప్రధాని. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని వెల్లడించారు.

Also Read:హ్యాపీ బర్త్ డే..డిప్యూటీ సీఎం పవన్

- Advertisement -