ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఫిబ్రవరిలో మోదీ వైట్‌హౌజ్‌ను సందర్శిస్తారని తెలిపారు ట్రంప్.
దేశాధ్యక్షుడిగా రెండో సారి ఎన్నికైన ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు ప్రధాని మోదీ . ఫ్లోరిడాలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వెళ్తున్న సమయంలో ట్రంప్ రిపోర్టర్లతో మాట్లాడారు. భారత ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడనని, ఆయన వైట్‌హౌజ్‌కు రానున్నారని, బహుశా ఫిబ్రవరిలో ఆయన శ్వేతసౌధాన్ని విజిట్ చేసే ఛాన్సు ఉన్నట్లు తెలిపారు.
భారత్‌తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు ట్రంప్. 2019లో హూస్టన్‌లో జరిగిన ర్యాలీలో.. 2020 ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్ – మోదీ ఇద్దరూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే.
Also Read:ISRO: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 15 కౌంట్‌డౌన్ షురూ