- Advertisement -
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 124వ జయంతి సందర్భంగా బెంగాల్ పర్యటనకు వెళ్లారు. కాసేపటి క్రితమే ప్రధాని కోల్ కతాకు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా నేతాజీ భవన్‌కు చేరుకున్న ఆయన.. నేతాజీకి నివాళి అర్పించి అనంతరం నేతాజీ మ్యూజియంను ప్రారంభించారు.
మరోవైపు, కోల్ కతాకు వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఆయన అసోంలో ఆగారు. అసోంకు కూడా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అసోంలోని స్థానికులకు ఆయన భూమి కేటాయింపుల పత్రాలను అందజేశారు. మరోవైపు బెంగాల్ ఇప్పటికే ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతోంది. బీజేపీ, టీఎంసీ పార్టీలు పోటీలు పడి ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఎన్నికల వేళ మోదీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
- Advertisement -