భారత్‌పై వరుస టారీఫ్‌లతో ట్రంప్ విరుచుకపడుతున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ మాట్లాడతానని ట్రంప్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో స్పందించారు మోదీ.
భారత్-అమెరికా సన్నిహిత మిత్ర దేశాలు.. సహజ భాగస్వాములు. వాణిజ్య చర్చలు ఇరుదేశాల భాగస్వామ్యం విస్తృతం చేసేందుకు దోహదం పడతాయని మోదీ తెలిపారు. ఇరుదేశాల అపరిమిత సామర్థ్యం విస్తృతానికి మార్గం సుగమం చేస్తామని విశ్వసిస్తున్నా. వీలైనంత త్వరగా చర్చలు ముగించడానికి మా బృందాలు కృషి చేస్తున్నాయి అన్నారు.
ట్రంప్ తో మాట్లాడేందుకు నేను కూడా ఎదురుచూస్తున్నా…. ఇరుదేశాల ప్రజల భవిష్యత్తు, భద్రత కోసం కలిసి పనిచేస్తాం అని మోదీ తెలిపారు. ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘భారత్ – అమెరికా వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి చర్చలు జరుపుతున్నాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. రాబోయే రోజుల్లో నా మంచి స్నేహితుడు ప్రధాని మోదీతో మాట్లాడటానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. ఈ చర్చలు విజయవంతంగా ముగియడం ఇరు దేశాలకు పెద్ద కష్టమేమీ కాదు అని ట్రంప్ అన్నారు.
Also Read:BB9:షాంపో గురించి రచ్చరచ్చ

