సుశాంత్‌ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం..

242
PM Modi
- Advertisement -

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. సుశాంత్ మరణవార్త దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న యువ నటుడు చిన్న వయసులోనే వెళ్లిపోయాడని వ్యాఖ్యానించారు.

అద్భుతమైన టాలెంట్‌ ఉన్న యువ నటుడు తొందరగా మనల్ని విడిచి వెళ్లిపోయాడు. టీవీ సీరియళ్లు, సినిమాల్లో సుశాంత్‌ అద్భుతంగా నటించేవాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో సుశాంత్‌ సింగ్‌ ఎంతోమందికి స్పూర్తి. సుశాంత్ జ్ఞాపకార్థంగా నిలిచిపోయే ఎన్నో ప్రదర్శనలు వదిలివెళ్లాడని.. అతని కుటుంబసభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

- Advertisement -