ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై ప్రధాని మోదీ

4
- Advertisement -

నాగర్‌కర్నూల్​ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ …ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. ముఖ్యమంత్రి గారు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రధానమంత్రికి తెలియజేశారు.

సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి తెలిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్​ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ప్రధానమంత్రికి వివరించారు.

Also Read:బీజేపీ అంటేనే బీసీల పార్టీ!

సహాయక చర్యల కోసం వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పంపిస్తామని మోదీ…ముఖ్యమంత్రికి తెలిపారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రిగారు హామీ ఇచ్చారు.

- Advertisement -