దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుగుతోంది. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ సరస్సు ఒడ్డున ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ…2014లో తొలిసారి తాను అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించానన్నారు. భారతదేశ ప్రతిపాదనకు 177 దేశాలు మద్దతిచ్చాయని చెప్పారు. అప్పటి నుండి ప్రపంచ యోగా గురుగా భారత్ మారిందని చెప్పారు మోడీ.
యోగా సాధన వల్ల సకారాత్మక ఆలోచనలు వస్తాయని తెలిపారు. యోగా, ధ్యానంతో మన ఏకాగ్రత పెరుగుతుందన్నారు. శ్రీనగర్‌లో ఒక శక్తి ఉందని, యోగా ద్వారా దానిని మరింత పెంచుకోవచ్చని తెలిపారు. జర్మనీలో ప్రస్తుతం కోటిన్నరమంది నిత్యం యోగా చేస్తున్నారని తెలిపారు. యోగా నేర్పే మహిళకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కిందన్నారు.
Also Read:Harishrao:ఉద్యమ నేత.. జయశంకర్ సార్