దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్ష..

102
PM Modi
- Advertisement -

దేశంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌పై ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో కరోనా పరిస్థితి, టెస్టులు, ఆక్సిజన్ లభ్యత, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, టీకా రోడ్‌మ్యాప్ పై అధికారులు ప్రధానికి వివరించారు. మార్చి ప్రారంభంలో వారానికి 50 లక్షల టెస్టుల నుండి ఇప్పుడు వారానికి 1.3 కోట్ల టెస్టుల వరకు పెరిగాయని అధికారులు తెలిపారు. క్రమంగా తగ్గుతున్న టెస్ట్ పాజిటివిటీ రేటు, పెరుగుతున్న రికవరీ రేటు అంశాలను పిఎంకు వివరణ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో అధిక టెస్ట్ పాజిటివిటీ రేట్ ఉన్న ప్రాంతాల్లో టెస్టులను మరింత పెంచాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ఇంటింటికీ పరీక్షలు, నిఘాపై దృష్టి పెట్టడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ వనరులను పెంచాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరాపై దృష్టిసారించాలని ప్రధాని ఆదేశించారు. అలాగే వెంటిలేటర్లు,ఇతర పరికరాల ఉపయోగించడంలో ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన శిక్షణ ఇవ్వాలన్న ప్రధాని మోదీ అన్నారు. వ్యాక్సినేషన్ మరింత వేగం పెంచేందుకు రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు.

- Advertisement -