ప్రధానికి ఘనా అత్యున్నత పురస్కారం

4
- Advertisement -

ప్రధాని మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం దక్కింది. మూడు దశాబ్దాల తర్వాత ఘనాలో పర్యటిస్తున్నారు భారత ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డు ప్రధానం చేశారు.

ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామ చేతుల మీదుగా సత్కారం అందగా పురస్కారాన్ని 140 కోట్ల భారతీయులకు అంకితమిచ్చారు ప్రధాని. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, “ఘానాలో నన్ను ఎంతో అభిమానంగా, ప్రేమతో స్వాగతించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పురస్కారం నాకు గౌరవంగా ఉందని తెలిపారు. ఈ గౌరవం భారత్-ఘానా మధ్య చారిత్రక సంబంధాలకు, యువత ఆశయాలకు, వారి భవిష్యత్తు ఆశయాలకు, భారత సంస్కృతి వైవిధ్యానికి అంకితం చేస్తున్నాను అన్నారు.

ఘనాతో కలిసి ఆయుధ దళాల శిక్షణ, సముద్ర భద్రత, రక్షణ సరఫరా, సైబర్ భద్రత వంటి రంగాల్లో మేము సహకారం పెంచుతాం అని ప్రకటించారు.ఘానాలో సుమారు 15,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో సుమారు 3,000 మందికి ఘానా పౌరసత్వం ఉంది. కొంతమంది భారతీయ కుటుంబాలు గత 70 సంవత్సరాలుగా అక్కడే జీవిస్తున్నారు.

Also Read:ఒకే జిల్లా…గుండెపోటుతో 23 మంది మృతి

- Advertisement -