- Advertisement -
ప్రధాని నరేంద్రమోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు అహ్మదాబాద్ చేరుకున్న మోదీ..సబర్మతీలోని రనిప్ పోలింగ్ కేంద్రం 115 లో ఓటు వేశారు. అయితే ఓటు వేసేందుకు ప్రధాని పోలింగ్ కేంద్రం బయట లైనులో నిలబడటం విశేషం. ఇక ప్రధాని రాకతో పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొంది.
లైనులో ఉన్నంతసేపు ప్రధాని అందరికీ అభివాదం చేస్తూ ఉన్నారు. ప్రధాని మోదీ సాధారణ వ్యక్తిలా తమతో ఓటు వేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా..మెహ్‌సనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, అలాగే అమిత్ షా, వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
…
- Advertisement -