టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టిన అథ్లెట్లతో పాటు మహాక్రీడలకు వెళ్లిన బృందంతో ఇవాళ ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన నివాసంలో అథ్లెట్లకు ప్రధాని
అల్పాహార విందు ఇచ్చారు. జావెలిన్ త్రో గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాతోనూ మోదీ ఫోటో దిగారు.హైదరాబాదీ షట్లర్ పీవీ సింధుతోనూ మోదీ కాసేపు ముచ్చటించారు. సింధుతో కలిసి మోదీ ఐస్‌క్రీమ్ తిన్నారు. రెండు మెడల్స్ మెడలో వేసుకుని ప్రధాని మోదీతో సింధు ఫోటో దిగింది.
టోక్యో గేమ్స్ వెళ్లే ముందు అథ్లెట్లతో ముచ్చటించిన సమయంలో.. పతకంతో తిరిగి వచ్చాక ఐస్‌క్రీమ్ తిందామని సింధుతో మోదీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లకు అల్పాహార విందునిచ్చారు ప్రధాని. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మొత్తం ఏడు మెడల్స్ వచ్చాయి. మెన్స్ హాకీ టీమ్‌తో పాటు నీరజ్ చోప్రా, సింధు, రవికుమార్ దహియా, భజరంగ్ పూనియా, మీరాబాయి ఛాను, లవ్లీనా బోర్గోహైన్ పతకాలు గెలిచారు.