యుకేకు ప్రధానమంత్రి మోడీ

5
- Advertisement -

నాలుగు రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జులై 23 నుంచి 26 వరకు సాగనుంది మోదీ విదేశీ పర్యటన. జులై 23, 24 తేదీల్లో బ్రిటన్‌లో పర్యటించనున్నారు. జులై 25, 26 తేదీల్లో మాల్దీవుల్లో పర్యటన సాగనుంది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పర్యటన సాగనుంది.

ఈనెల 25, 26 తేదీల్లో మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు . మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకానున్నారు. ఈ పర్యటన భారతదేశం యొక్క ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడమే కాక, భారత్-యుకె ఉచిత వాణిజ్య ఒప్పందాన్ని (FTA)లో కీలకంగా మారనుంది. ఈ ఒప్పందం ద్వారా ప్రస్తుతం ఉన్న USD 60 బిలియన్ పరస్పర వాణిజ్యాన్ని 2030 నాటికి రెండింతలు చేసే దిశగా దోహదపడుతుంది.

Also Read:జోషి దర్శకత్వంలో ఉన్ని ముకుందన్!

- Advertisement -