- Advertisement -
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ నేపాల్‌లో పర్యటించనున్నారు. జలవిద్యుత్ ప్రాజెక్టులు, అభివృద్ధి, ఇరు దేశాల మధ్య రాకపోకలకు సంబంధించిన రవాణా, మౌలిక వసతుల కల్పనవంటి అంశాలపై ఈ పర్యటనలో చర్చించనున్నారు.
అలాగే తన పర్యటనలో భాగంగా లుంబిని బౌద్ధ క్షేత్రాన్ని మోదీ సందర్శించనున్నారు. గత నెలలో నేపాల్ ప్రధాని దేవ్‌బా భారత్ సందర్శించిన సమయంలో చర్చలు ఫలవంతమైనాయన్న విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు.
శతాబ్దాల తరబడి ఇరు దేశాల మధ్య, ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు ధృడంగా మారాయన్న ఆయన వాటిని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.2019 తరువాత ప్రధాని మోదీ నేపాల్‌లో పర్యటించడం ఇదే మొదటి సారి.
- Advertisement -