- Advertisement -
ఈనెల 25, 26 తేదీల్లో మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకానున్నారు. మోదీ జూలై 23 నుంచి 26 వరకు యునైటెడ్ కింగ్‌డమ్ మరియు మాల్దీవులు దేశాలను నాలుగు రోజుల పాటు సందర్శించనున్నారు.
ఈ పర్యటన భారతదేశం యొక్క ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడమే కాక, భారత్-యుకె ఉచిత వాణిజ్య ఒప్పందాన్ని (FTA)లో కీలకంగా మారనుంది. ఈ ఒప్పందం ద్వారా ప్రస్తుతం ఉన్న USD 60 బిలియన్ పరస్పర వాణిజ్యాన్ని 2030 నాటికి రెండింతలు చేసే దిశగా దోహదపడుతుంది.
తొలుత మోదీ జూలై 23–24 తేదీల్లో యుకెకి వెళ్తారు. తరువాత జూలై 25–26 మధ్య మాల్దీవులను సందర్శిస్తారు. మాల్దీవుల్లో జరిగిన సంబంధాల మాంద్యం నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read:హద్దు దాటుతున్న ఈడీ అధికారులు!
- Advertisement -

