Modi:ఇజ్రాయెల్‌కు ప్రధాని మోడీ

5
- Advertisement -

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలకడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమయ్యే రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ ఇజ్రాయెల్‌ను సందర్శించనున్నారు. రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం ఈ పర్యటన లక్ష్యం. గత 9 ఏళ్లలో ఇది ఆయన రెండో ఇజ్రాయెల్ పర్యటన. 2017 జూలైలో జరిగిన తొలి పర్యటనలో భారత్–ఇజ్రాయెల్ సంబంధాలు “స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్” స్థాయికి ఎదిగాయి.

ఈసారి రెండు దేశాల సంబంధాలను “స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్” స్థాయికి తీసుకెళ్లేందుకు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. రక్షణ వ్యవస్థల సంయుక్త అభివృద్ధి, అవసర సమయాల్లో పరస్పర సహకారం వంటి అంశాలు ఇందులో భాగం కానున్నాయి.

మోదీ పర్యటనకు గౌరవ సూచకంగా ఇజ్రాయెల్ పార్లమెంట్ ‘క్నెసెట్’ భవనాన్ని భారత త్రివర్ణ పతాక రంగులతో అలంకరించారు. క్నెసెట్ స్పీకర్ అమీర్ ఓహానా రాత్రి సమయంలో వెలుగులతో మెరిసిన భవనం చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది భారత్–ఇజ్రాయెల్ మధ్య బలపడుతున్న స్నేహబంధానికి ప్రతీకగా భావిస్తున్నారు.

Also Read:షూతో కీళ్ల నొప్పులు..షాకింగ్!

మోదీని విమానాశ్రయంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ మరియు ఆయన భార్య సారా స్వాగతించనున్నారు. అనంతరం ఇద్దరు నేతలు సమావేశమై చర్చలు జరపనున్నారు. యెరూషలేమ్‌లో భారతీయులతో భేటీ అయ్యే మోదీ, క్నెసెట్‌లో ప్రసంగించనున్నారు. సాయంత్రం ఇజ్రాయెల్ సాంకేతిక ప్రదర్శనను సందర్శించి, రాత్రి నెతన్యాహూ ఏర్పాటు చేసిన విందులో పాల్గొననున్నారు.

- Advertisement -