హైజంపర్‌ ప్రవీణ్‌ కుమార్‌పై ప్రధాని ప్రశంసలు..

162
- Advertisement -

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకాన్ని అందించిన హైజంపర్‌ ప్రవీణ్‌ కుమార్‌ను ప్రధాని మోదీ అభినందించారు. అతని కృషి, పట్టుదలకు ఈ పతకమే నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘పారాలింపిక్స్‌లో ప్రవీణ్‌ కుమార్‌ రజత పతకం సాధించినందుకు గర్వపడుతున్నాను. ఈ పతకం అతని కృషి, అసమానమైన అంకితభావానికి నిదర్శనం. ప్రవీణ్‌ కుమార్‌ను ప్రశంసించారు.. భవిష్యత్‌లో అతను చేసే ప్రయత్నాలకు శుభాకాంక్షలు’ అని ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా అభినందించారు.

పురుషుల హైజంప్‌లో ప్రవీణ్‌ కుమార్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. శుక్రవారం బంగారు పతకం కోసం జరిగిన ఫైనల్‌లో గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన జోనాథన్‌ ఎడ్‌వర్డ్స్‌ 2.10 మీటర్లు ఎత్తు ఎగిరాడు. అయితే ప్రవీణ్‌ దీనిని అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో జొనాథన్‌ బంగారు పతకం సాధించగా, ప్రవీణ్‌ కుమార్‌ (2.07 మీ.) రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక పోలాండ్‌కు చెందిన మసీజ్‌ లెపియాటోకు బ్రోన్జ్‌ మెడల్‌ దక్కింది. ప్రవీణ్ సాధించిన విజయంతో ఈ పారాలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 11కు చేరింది.

- Advertisement -