రోశయ్య మృతి పట్ల ప్రధాని మోదీ ఆవేదన..

111
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. రోశయ్య మృతితో ఎంతో బాధకు గురయ్యానని చెప్పారు. తామిద్దరం ముఖ్యమంత్రులుగా పని చేసినప్పుడు, ఆయన తమిళనాడు గవర్నర్‌గా ఉన్నప్పుడు తమ మధ్య జరిగిన సంభాషణలు గుర్తొస్తున్నాయని తెలిపారు. సమాజం కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు. రోశయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రోశయ్య తనను కలిసినప్పటి ఫొటోను షేర్ చేశారు.

కాగా, రోశయ్య మృతికి తెలంగాణ ప్రభుత్వం మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రోశయ్య అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. రోశయ్య పార్థివ దేహానికి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -