కెనడాకు ప్రధాన మోదీ

6
- Advertisement -

ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి కెనడాలో జీ7 సదస్సు జరగనుండగా ఈ సమావేశంలో పాల్గొనున్నారు మోదీ. కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ప్రధానిని ఫోన్ ద్వారా ఆహ్వానించారని సమాచారం.

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన తర్వాత భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం కెనడాకే కాకుండా సైప్రస్, క్రొయేషియా దేశాలను కూడా సందర్శించనున్నారు.

జూన్ 16, 17 తేదీల్లో కెనడాలోని కననాస్కిస్‌లో జరగబోయే జీ-7 శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటారు. జూన్ 15 నుంచి 16 వరకు ప్రధాని మోదీ సైప్రస్ పర్యటనలో పాల్గొంటారు. జూన్ 18న క్రొయేషియా పర్యటనను కొనసాగించనున్నారు.

Also Read:నీట్‌ యూజీ 2025.. ఫలితాలు విడుదల

- Advertisement -