బ్రెజిల్ వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో ప్రపంచ దేశాధినేతలతో ప్రధాని మోదీ వరుస భేటీలు జరిపారు. యూఎస్, ఇటలీ, యూకే, ఇండోనేషియా, నార్వే, పోర్చుగల్, బ్రిటన్, ఫ్రాన్స్, తదితర దేశాధినేతలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో మోదీ కొద్దిసేపు చర్చించారు. అమెరికాలో ఎన్నికల అనంతరం వారిద్దరూ కలుసుకోవడం ఇదే తొలిసారి. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తోనూ మోదీ భేటీ అయ్యారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తో భేటీ అయ్యారు. నా స్నేహితుడు, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. భారత్, ఫ్రాన్స్ లు అంతరిక్షం, ఇందనం, ఏఐ వంటి ఇతర రంగాల్లో సన్నిహితంగా పనిచేయడంపై చర్చించాం అన్నారు. రాబోయే కాలంలో సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, భద్రత, ఆవిష్కరణ వంటి రంగాల్లో బ్రిటన్ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. వాణిజ్యంతో పాటు సాంస్కృతిక సంబంధాలనుసైతం బలపర్చాలనుకుంటున్నాం అని తెలిపారు.
Also Read:కేసీఆర్ పేరుతో సినిమా గొప్ప విషయం: హరీశ్