ఎంజీఆర్ ప్రజల మనిషి: మోదీ

113
modi
- Advertisement -

మాజీ సీఎం ఎంజీఆర్ ప్రజల మనిషి అన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఎంజీఆర్ పేద ప్ర‌జ‌ల ప‌ట్ల ఎంతో ఉదార‌త‌తో ఉండేవారని….. ఆరోగ్యం, విద్య, మ‌హిళా సాధికార‌త వంటి అంశాల‌ను ప‌ట్టించుకునేవార‌న్నారు. త‌మిళ‌నాడులోని డాక్ట‌ర్ ఎంజీఆర్ మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ స్నాత‌కోత్స‌వంలో పాల్గొని వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రసంగించిన మోదీ… భార‌తీయ ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను ఇప్పుడు అంద‌రూ కొత్త క‌ళ్ల‌తో, కొత్త గౌర‌వంతో, కొత్త విశ్వాసంతో చూస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.

శ్రీలంక‌లోని డిక్ ఓయా హాస్పిట‌ల్ ప్రారంభోత్స‌వాన్ని తానెప్పుడూ మ‌రిచిపోన‌న్నారు. ఈ ఆధునిక హాస్పిట‌ల్ ఎంద‌రికో సేవ చేస్తుంద‌న్నారు. శ్రీలంక‌లో ఎంజీఆర్ పుట్టిన గ్రామాన్ని కొన్నేళ్ల క్రితం తాను సంద‌ర్శించానని లంకలో ఉన్న త‌మిళ‌ల ఆరోగ్యం కోసం ప‌నిచేసేందుకు భార‌త్ క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు.

ప‌రీక్ష‌ల్లో మార్క్‌లు సాధించ‌డంతో పాటు.. స‌మాజంలో పేరు సంపాదించుకునే సంధి కాలంలో మీరున్నార‌ని, కోవిడ్ మ‌హ‌మ్మారి వేళ భార‌త్ కొత్త పంథాల‌ను వెలుగుచూసింద‌న్నారు.

- Advertisement -