ఇండోనేషియాలో ప్రధానికి ఘనస్వాగతం..

10
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. ఆసియాన్-భారత్, 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు ఇండోనేషియాకు చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు మువ్వన్నెల జెండాతో ప్రధానికి స్వాగతం పలికారు.

చిన్న పిల్లలను ఆప్యాయంగ పలకరించగా ప్రధానితో సెల్ఫీ దిగేందుకు అంతా పోటీపడ్డారు. జకార్తాలో అడుగు పెట్టాను, వివిధ దేశాల అధినేతలతో కలిసి మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నాను అని ప్రధాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రధాని మోదీ ఆసియాన్-ఇండియా సమ్మిట్‌లో పాల్గొంటారు. తర్వాత తూర్పు ఆసియా సదస్సుకు హాజరవుతారు. తిరిగి సెప్టెంబర్ 9, 10 తేదీల్లో భారతదేశం జి20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఢిల్లీకి చేరుకుంటారు.

Also Read:శ్రీ కృష్ణాష్టమి…విశిష్టత

- Advertisement -