తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లకు కీలక విన్నపం చేశారు. ఓటు వేయడాన్ని…పవిత్రమైన ప్రజాస్వామ్య బాధ్యత గా అభివర్ణించిన ఆయన, ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి రికార్డు స్థాయి పోలింగ్‌ను నమోదు చేయాలని కోరారు.
గురువారం ఉదయం ‘X’ (గతంలో ట్విట్టర్) వేదికగా తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రత్యేక పోస్ట్‌లు చేశారు.మిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని స్పందిస్తూ.. “తమిళనాడు ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో, ఓటర్లందరూ ఈ పవిత్రమైన ప్రజాస్వామ్య బాధ్యతను ఉత్సాహంగా నెరవేర్చాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా యువత మరియు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగేలా చూడాలి” అని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో మొదటి విడత పోలింగ్ (152 నియోజకవర్గాల్లో) జరుగుతున్న నేపథ్యంలో, దీనిని ఒక ప్రజాస్వామ్య పండుగగా ప్రధాని అభివర్ణించారు. “ఈ రోజు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ జరుగుతోంది. పౌరులందరూ పూర్తి ఉత్సాహంతో ఈ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాను. నా యువ మిత్రులు, మహిళా ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటు వేయాలి” అని ఆయన కోరారు.
తమిళనాడు: మొత్తం 234 సీట్లకు ఒకే విడతలో (ఏప్రిల్ 23) పోలింగ్ జరుగుతోంది.
పశ్చిమ బెంగాల్: మొత్తం 294 సీట్లకు రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నేడు (ఏప్రిల్ 23) మొదటి విడత పోలింగ్ ప్రారంభం కాగా, రెండో విడత ఏప్రిల్ 29న జరగనుంది.
Also Read:సీనియర్ ఐపీఎస్‌లకు ప్రమోషన్లు
సమయం: ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6:00 గంటల వరకు కొనసాగుతుంది.
ఫలితాలు: ఓట్ల లెక్కింపు మే 4వ తేదీన జరగనుంది.
రెండు రాష్ట్రాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం మొదటి విడతలో మొత్తం 1,478 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

