ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2(శుక్రవారం) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఏపీ రాజధాని అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3.25గంటలకు ప్రధాని సచివాలయం హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పున: ప్రారంభిస్తారు.
ఆ తర్వాత పలు ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అమరావతిలో జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రధాని ప్రసంగిస్తారు. బహిరంగసభ నేపథ్యంలో కూటమి నేతలు అన్ని ఏర్పట్లు పూర్తి చేశారు. నరేంద్ర మోదీ అమరావతిలో చేపట్టే రూ. 49,040 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రాజెక్టుల్లో భాగంగా డీఆర్డీఓ, డీపీఐఐటీ, రైల్వేస్, NHAIకు సంబంధించిన రూ.57,962 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి నుంచి వర్చుల్ పద్దతిలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
అమరావతి పనుల పున:ప్రారంభానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం పంపించింది. ప్రధాని చేతులు మీదుగా జరిగే కార్యక్రమానికి రావాలని కోరుతూ ప్రభుత్వం ఆహ్వానం అందించింది. అయితే జగన్ ఈ సభకు వస్తారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read:IPL: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్

