- Advertisement -
నేడు పార్లమెంట్ ఉభయ సభల ఫ్లోర్ లీడర్లతో ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది.దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించనున్నారు నేతలు.దేశంలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.ఉదయం 10.30 నిమిషాలకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ భేటీలో లోక్‌సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లతో పాటు కేంద్ర మంత్రులు అమిత్‌షా, హర్షవర్దన్, రాజ్‌నాథ్, ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్ మేఘావల్, మురళీధరన్‌లు కూడా వర్చువల్ సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం. ఇప్పటికే విపక్ష ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానం పంపింది కేంద్ర ప్రభుత్వం.
- Advertisement -