కరోనా సెకండ్‌ వేవ్‌ను అడ్డుకుందాం: ప్రధాని మోదీ

104
modi
- Advertisement -

కోవిడ్ సెకండ్ వేవ్‌ను అంతా కలిసి అడ్డుకోవాల్సిందేనని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సులో కీలకాంశాలు చర్చించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యూపీ రాష్ట్రాల్లో 10% పైగా వ్యాక్సిన్లు వృధా అవడంపై చర్చ జరిగింది. వ్యాక్సిన్లు వృధా అవకుండా పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

ఇందుకు త్వరితగతిన చర్యలు, నిర్ణయాత్మక అడుగులు వేయాలి….ఈ మహమ్మారిని ఆపకపోతే, ఇది మళ్లీ దేశవ్యాప్తంగా విస్తరిస్తుందన్నారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో టెస్టింగ్ తక్కువగా జరుగుతోందన్న ప్రధాని…క్సినేషన్ కూడా కొన్ని ప్రాంతాల్లో చాలా మందకోడిగా సాగుతోందన్నారు. మన ఆత్మవిశ్వాసం అతివిశ్వాసంగా మారకూడదని…మన విజయం నిర్లక్ష్యంగా మారకూడదన్నారు.

మరోసారి ప్రజలను భయాందోళనలకు గురయ్యే పరిస్థితులు రానీయవద్దు…జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ జనజీవనం సాగేలా చూడాలన్నారు. ఇప్పుడు మనం మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన సమయం…..మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తూ వ్యాప్తిని కట్టడి చేయాలన్నారు. కోవిడ్‌పై యుద్ధంలో భారత్ ప్రదర్శించిన తెగువ ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలిచింది…అతి తక్కువ మరణాలు, 96% మించి రికవరీ రేటు సాధించాం అన్నారు.సేఫ్-జోన్లుగా ఉన్న జిల్లాల్లో కేసులు 150% మేర పెరిగాయని తెలిపారు మోదీ.

- Advertisement -