ప్లాప్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్.. రీజన్ అదే !

194
- Advertisement -

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు ‘నారప్ప’ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. వెంకటేష్ సినీ కెరీర్ లో మరో క్లాసిక్ హిట్ గా నిలిచింది. అయినా శ్రీకాంత్ అడ్డాలకు ఛాన్స్ లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. కాకపోతే.. మంచి దర్శకుడిగా ఉన్న పేరు పెరిగింది. కానీ, శ్రీకాంత్ అడ్డాల సినిమాలు కమర్శియల్ గా పెద్దగా వర్కౌట్ కావు అని ఓ ముద్ర ఉంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో శ్రీకాంత్ అడ్డాలకు స్టార్ డమ్ రాలేదు. ఐతే, ఒకప్పుడు ముఖం చాటేసే నిర్మాతలే ఇప్పుడు ఎదురెళ్లి శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేస్తాం అంటున్నారు.

మా బ్యానర్లో సినిమాలు చేయండి అంటూ శ్రీకాంత్ అడ్డాలకు అడ్వాన్సులు చెల్లించడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. దీంతో దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల కెరీర్ ఓ ట్రాక్ లో పడినట్లే. ఇప్పుడు పెద్ద బ్యానర్లో శ్రీకాంత్ అడ్డాలకి అవకాశాలు వస్తున్నాయి. అయితే, ఈ ఛాన్స్ ల వెనుక కారణం శ్రీకాంత్ అడ్డాల దగ్గర ఉన్న కథ అని తెలుస్తోంది. శ్రీకాంత్ అడ్డాల మంచి స్క్రిప్ట్ రెడీ చేశాడట. పైగా షూటింగ్ డేస్ కూడా బాగా తక్కువగా ఉండేలా పక్కా షెడ్యూల్స్ ప్లాన్ చేశాడట.

ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణంలో నెమ్మదిగా షూటింగ్ చేస్తే.. పనవ్వదని గ్రహించి శ్రీకాంత్ అడ్డాల వేగం పెంచాలని నిర్ణయించుకున్నాడు. పైగా ఈ సారి కూడా తాను నమ్మిన ఫార్ములా బేస్డ్ చిత్రాన్నే తీయడానికి శ్రీకాంత్ అడ్డాల రెడీ అవుతున్నాడు. మళ్ళీ ఓ ఎమోషనల్ క్లాసిక్ ఫ్యామిలీ స్టోరీని సిద్దం చేశాడట. పైగా ఇది డిఫరెంట్ లవ్ స్టోరీ అని…గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగుతుందని సమాచారం. ఇంతవరకూ ఇండియన్ స్క్రీన్ పై ఏ దర్శకుడు తీసుకొని సరికొత్త పాయింట్ తో శ్రీకాంత్ అడ్డాల ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడట. ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఈ చిత్రం కథాకథనాలు సాగుతాయని శ్రీకాంత్ అడ్డాల సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది.

ఇవి కూడా చదవండి…

అల్లరోడిని ముంచేసిన డబ్బింగ్ సినిమా

బాలీవుడ్ హీరోయిన్ తో ప్రభాస్ డేటింగ్ ?

యాంకర్స్ కు వేధింపులు.. కటకటాల్లోకి నిందితుడు !

- Advertisement -