తెలంగాణ కుంభమేళా మేడారం అమ్మవార్లను దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న రేవంత్..వనదేవతలు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, రాష్ట్ర సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్..ఇది మీ ప్రభుత్వమని, ప్రభుత్వాన్ని మీరే చూసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వంపై బీఆర్‌ఎస్, బీజేపీ కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ప్రెస్ అకాడమీకి చైర్మన్‌ను నియమించి జర్నలిస్టుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ప్రాజెక్టుల నష్టంపై నిపుణుల కమిటీ వస్తుందని, వారు సూచిస్తే మరమ్మతులు చేస్తామని, లేని పక్షంలో ప్రాజెక్టుల పునర్నిర్మాణానికి వెళ్తామని చెప్పారు. ఫిబ్రవరి 27 నుండి అర్హులైన వ్యక్తులు రూ. 500కి గ్యాస్‌ను మరియు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను పొందుతారన్నారు.
Also Read:ఆకు కూరలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?